

చిన్నారి పాప ఆశ
అనగనగా ఒక ఊరిలో ఒక ఇల్లు ఉండేది. అందులో ఒక కుటుంబం నాన్న అమ్మ ఒక పాప చాలా సంతోషంగా నివసిస్తూ ఉండేవారు. ఇక్కడికి దగ్గరలో కొన్ని పంట పొలాలు ఉండేవి వాటి కోసం పక్షులూ ఇళ్ల దగ్గరికి వస్తూ ఉండేవి. ఆ ఇంట్లో ఉన్న పాపకి ఆ పక్షుల గొంతు వింటుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది.
కానీ పక్షులు ఉదయం సాయంత్రం కాసేపు మాత్రమే వస్తుండేవి కానీ పాపం ఆ పాపకి చాలాసేపు పక్షుల గొంతు వినాలని ఉండేది. వాళ్ల అమ్మతో ఈ విషయాన్ని చెప్పింది దానికి వాళ్ల అమ్మ ఇలా అంది ఈ ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళుతున్నాయి నాన్న ఉద్యోగానికి వెళ్లినట్టు అని చెప్పింది దానికి ఆ పాపాన్ని నాన్న మనకోసం ఆహారాన్ని తెస్తున్నారు గా మనమే వాటికి ఆహారం ఇద్దాము అప్పుడు ఎంచక్కా పక్షులు మన ఇంట్లోనే ఉంటాయి అని దానికి ఆ తల్లి సరే అని రోజూ పక్షుల కోసం కాస్త బియ్యాన్ని కొన్ని మంచి నీళ్ళని పెడుతూ ఉండేది గత కొన్ని రోజులు పాప సంతోషంగా గడిపింది కడుపుతో ఉన్న పిల్లి పాల కోసం అరుస్తుంటే ఆ తల్లి పాపం పిల్లికి కూడా పాలు పోసేది . ప్రజలకి ఆ పిల్లి 3 పిల్లలకు జన్మనిచ్చింది పిల్లల ఆహారం కోసం ఆ పిల్లి కాపుకాసి బియ్యం తినడానికి వచ్చిన పక్షులను పట్టుకునే ప్రయత్నం చేసింది అంతే పాపం ఆ పక్షులన్నీ బియ్యం దగ్గరికి రావడానికి భయపడి దగ్గరలో ఉన్న చెట్టు మీదకి వచ్చి గట్టిగా అరుస్తూ ఉండేవి కొన్ని రోజులకి ఆ తల్లి ఏమిటి ఆ పక్షులు బియ్యం తినటం లేదు అని చూస్తే ఆ పిల్లి పక్షులను తినడానికి గోడ పక్కన నక్కి కనిపించింది. అతనితో ఆ ఇంట్లో తల్లి పిల్లలకి పాలు పోయడం ఆపేసింది కొన్ని రోజులకి ఆ పిల్లి పాలు లేక పక్షులు అందక వేరేచోట పిల్లలతో సహా వెళ్ళిపోయింది అప్పుడు పక్షులు ఎప్పటిలాగా హాయిగా వచ్చి దానితో చిన్నారి పాప ఎంతో సంతోషించింది.
QUOTES WHICH I PREPARED UNDER MY KALAM NAME: -------NA NENU...









